మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..!

Friday, January 1st, 2021, 01:35:15 AM IST


మందు బాబులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఇన్ని రోజులు పాత బ్రాండ్ల బీర్లు దొరక్క కొత్త బ్రాండ్ల బీర్లు తాగి విసిగిపోయిన బీరు బాబులకు గుడ్ న్యూస్ అందింది. ఇకపై ఏపీలో పాత బ్రాండ్ల బీర్లు ప్రభుత్వ మద్యం దుకాణాల్లోకి రాబోతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కింగ్ ఫిషర్, బడ్వైజర్ బీర్లు ప్రతి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దొరకబోతున్నాయి.

అయితే రోజుకు 5 కేసుల కింగ్ ఫిషర్, బడ్వైజర్ బీర్లను అందుబాటులో ప్రతి ప్రభుత్వ మద్యం దుకాణంలో ఉంచనున్నట్లు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో బీరు ప్రియులు పండగ చేసుకుంటున్నారు. నూతన సంవత్సరం నాడు కూడా అలవాటు లేని బీర్లనే తాగాలా అని బాధపడే వారికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిజంగా ఊరటనిచ్చే అంశమని చెప్పాలి.