ఏపీలో కొత్త జిల్లాల ప్రకటన తేదీపై క్లారిటీ.. మొత్తం ఎన్నంటే?

Tuesday, October 27th, 2020, 05:38:02 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుకు పావులు కదుపుతుంది. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై కేబినేట్ భేటీలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్న జగన్ సర్కార్ దీనికి సబంధించి అధ్యయనం చేసేందుకు ఓ కమిటీనీ కూడా ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు కావలసిన వనరులు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ అధ్యయనం చేసి మూడు నెలల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే ఏపీలో కొత్త జిల్లాలు ఎప్పుడు ఏర్పాటు కాబోతున్నాయన్న దానిపై ఓ క్లారిటీ వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వచ్చే ఏడాది జనవరి 26న స్పష్టమైన ప్రకటన ఉంటుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. అయితే పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేయాలని అనుకున్నప్పటికి, అరకు నియోజకవర్గంలో సంక్లిష్టత ఏర్పడిందని, దీంతో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపారు.