ట్యూషన్ ఫీజులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

Saturday, October 31st, 2020, 01:10:46 AM IST


ప్రైవేట్‌ ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ కళాశాలల్లో ట్యూషన్‌ ఫీజులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కాలేజీలలో ట్యూషన్‌ ఫీజును 30 శాతం తగ్గించి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

అయితే ట్యూషన్‌ ఫీజు 70 శాతం మాత్రమే వసూలు చేయాలని, పూర్తి ఫీజు వసూలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం ఒకింత హెచ్చరించింది. ఇదిలా ఉంటే ఏపీలో నవంబర్ 2 నుంచి విద్యాసంస్థలను పున:ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సిద్దమయ్యింది. ఈ మేరకు ప్రభుత్వం నిన్న కొత్త షెడ్యూలును విడుదల చేసింది. నవంబర్ 2 నుంచి 9,10 తరగతులు, ఇంటర్‌కు క్లాస్‌లు ప్రారంభం అవుతుండగా, నవంబర్-23 నుంచి 6,7,8 నుంచి తరగతులు, డిసెంబర్-14 నుంచి 1,2,3,4,5 తరగతులకు క్లాస్‌లు ప్రారంభమవుతున్నాయి.