ఇసుక తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ..!

Tuesday, August 11th, 2020, 11:21:48 AM IST

ఏపీలో ఇసుక తవ్వకాలు, రవాణా సరఫరాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక తవ్వకాలు, లోడింగ్‌, సరఫరా, డోర్‌ డెలివరీకి వివిధ స్థాయిల్లో ధరలను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గనుల శాఖ ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఓపెన్‌ రీచ్‌లు, పట్టాదారు భూముల్లో ఇసుక తవ్వకానికి టన్నుకు 90 రూపాయలుగా గనుల శాఖ నిర్ణయించింది. జేసీబీ ద్వారా ఇసుక లోడింగ్‌ రుసుము టన్నుకు 25 రూపాయలుగా, ఇసుక రవాణాకు కిలోమీటరుకు రూ. 4.90 రూపాయలు నిర్ణయించినట్టు తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ధరలు 40 కిలోమీటర్ల దూరం వరకు వర్తిస్తాయని, 40 కిలోమీటర్లు దాటితే ప్రతి టన్నుకు అదనంగా రూ. 4.90ల చొప్పున వసూలు చేయనున్నట్టు ఉత్తర్వుల ద్వారా తెలిపింది.