న్యూ ఇయర్ వేడుకలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ రెండ్రోజులు కర్ఫ్యూ

Tuesday, December 15th, 2020, 05:20:46 PM IST

ఈ సారి న్యూ ఇయర్ వేడుకలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సర వేడుకలను రద్దు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 31, జనవరి 1న కర్ఫ్యూ విధించింది. రాష్ట్రంలో జనవరి 15వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ మధ్యలో మరోసారి కరోనా విజృంభించే ప్రమాదముందని కేంద్ర వైద్య నిపుణులు హెచ్చరించడంతో మరోసారి కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది.

ఈ నేపధ్యంలో ఈ నెల 26 నుంచి జనవరి 1 వరకు రాష్ట్రంలో అన్ని రకాల వేడుకలు రద్దు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం నిశ్చయించింది. ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్రంలో రెస్టారెంట్లు, హోటల్స్, రిసార్టులు, మార్కెట్లు, మాల్స్‌, సినిమా థియేటర్లలో కొన్ని ఆంక్షలు అమలు చేయనుంది. ఇవే కాకుండా వైన్‌ షాపులు, బార్ల సమయాల్ని కుదిస్తుండగా, విద్యా సంస్థలకు కూడా కొన్ని సూచనలు చేస్తున్నట్టు సమాచారం.