ఇంటర్మీడియట్ సిలబస్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Monday, August 17th, 2020, 09:09:25 AM IST

YS_Jagan

కరోనా ప్రభావం, లాక్‌డౌన్ కారణంగా గత ఏడాది పరీక్షలు లేకుండానే చాలా రాష్ట్రాలు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశాయి. అయితే ఇంకా కరోనా ప్రభావం తగ్గకపోవడంతొ ఇప్పటి వరకు ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు.

అయితే ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమవుతున్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం ఇంటర్మీడియట్ సిలబస్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 30% సిలబస్‌ను తగ్గిస్తున్నట్టు ఏపీ ఇంటర్ విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఇప్పటికే సీబీఎస్ఈ 30 శాతం సిలబస్‌ను తగ్గించగా, అందుకు అనుగుణంగా కొన్ని పాఠ్యాంశాలను తొలగించినట్టు విద్యాశాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అక్టోబర్ 15 నుంచి కాలేజీలు ప్రారంభిస్తామని జగన్ సర్కార్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.