భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు.. అ రోజు ఆర్టీసీ బస్సులు బంద్..!

Wednesday, March 24th, 2021, 12:18:14 AM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్ధతు ప్రకటించింది. అయితే బంద్‌లో భాగంగా ఈ నెల 26న మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేయనున్నట్టు మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంటును కొంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినా కేంద్రం తిరస్కరించిందని, ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బిడ్డింగులో పాల్గొనమని కేంద్రం సూచించిందని అన్నారు.

అయితే ఏపీకి ప్రత్యేక హోదా గురించి టీడీపీకి మాట్లాడే అర్హత లేదని, ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి కూడా పట్టే పరిస్థితి వస్తుందని మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. ఇసుక అక్రమాలు చంద్రబాబు హయాంలోనే ఎక్కువగా జరిగాయని, ఇసుక ప్రైవేట్ వారికి అప్పగించడం ద్వారా రూ.765 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వస్తుందని గత ఐదేళ్లు ఈ సొమ్ము ఎక్కడికి పోయిందని పేర్ని నాని నాని ప్రశ్నించారు.