మూడు రాజధానులపై స్పీడు పెంచిన ఏపీ సర్కార్..!

Monday, August 10th, 2020, 06:28:22 PM IST

ఏపీలో మూడు రాజధానుల నిర్మాణం చేపట్టే విషయంలో ప్రభుత్వం మరింత స్పీడు పెంచింది. ఇప్పటికే సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన ఏపీ సర్కార్ తాజాగా దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.

ఇదిలా ఉంటే మూడు రాజధానుల బిల్లులకు హైకోర్టు ఈ నెల 14వ తేదీ వరకు స్టేటస్‌కో విధించిన కారణంగా దీనిపై స్టే విధించాలని ఏపీ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు విచారణ జరుగుతుందని అనుకున్నా విచారణ జరగకపోవడంతో అత్యవసర విచారణ చేపట్టాలంటూ సర్కార్ అప్లికేషన్ దాఖలు చేసింది. మూడు రాజధానుల నిర్ణయానికి సంబంధించి మరింత అదనపు సమాచారాన్ని న్యాయస్థానానికి అందజేసింది.