ఏపీ ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రభుత్వ అన్లాక్ 5 మార్గదర్శకాలను అనుసరించి ఏపీలో కూడా అన్లాక్ 5 గైడ్లైన్స్ జారీ చేసింది. అయితే ఈ గైడ్లైన్స్ ప్రకారం అక్టోబర్ 15 నుంచి 50 శాతం సీట్లతో సినిమా థియేటర్లను తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఏపీలో కూడా తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
అంతేకాదు ఎంటర్టైన్మెంట్ పార్కులకి, క్రీడాకారులు ప్రాక్టీస్ చేయడానికి స్విమ్మింగ్ ఫూల్స్కి కూడా అనుమతిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక విద్యార్థుల తల్లిదండ్రులు అనుమతి తోనే పిల్లలను స్కూళ్లలోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని, ఎక్కువగా ఆన్లైన్ క్లాసులకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఇదిలాఉంటే తాజా నిర్ణయంతో ఆరు నెలల తర్వాత ఏపీలో మళ్లీ ధియేటర్లు తెరుచుకోబోతున్నాయి. అయితే అన్ని నిబంధనలు పాటించినా సినిమాలు చూసేందుకు జనాలు థియేటర్లకు వస్తారా, వచ్చినా 50 శాతం సీటింగ్ కావడంతో దర్శక నిర్మాతలు పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు అందరిలోనూ మెదలుతున్న ప్రశ్న.