అన్‌లాక్ 4 మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కార్..!

Monday, September 7th, 2020, 02:15:22 PM IST

YS_Jagan

ఏపీ ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రభుత్వ అన్‌లాక్ 4 మార్గదర్శకాలను అనుసరించి ఏపీలో అన్‌లాక్ 4 గైడ్‌లైన్స్ జారీ చేసింది. అయితే ఈ గైడ్‌లైన్స్ ప్రకారం సెప్టెంబర్ 30 వరకూ స్కూళ్లు మూసి ఉంటాయని అయితే 9, 10వ తరగతి విద్యార్థులు మాత్రం స్కూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

సెప్టెంబర్ 21 నుంచి 9, 10వ తరగతి విద్యార్థులు స్కూళ్లకు వెళ్ళవచ్చని, ఆ రోజు నుంచే ఇంటర్ విద్యార్థులు కూడా కాలేజీలకు వెళ్ళవచ్చు అని ఆదేశాలు ఇచ్చింది. అయితే తమ పిల్లలను స్కూళ్లకు, కాలేజీలకు పంపుతున్నట్టు తల్లిదండ్రులు లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఇకపోతే సెప్టెంబర్ 21 నుంచి విద్యా, సామాజిక, స్పోర్ట్స్, మతపరమైన, రాజకీయ సమావేశాలకు ప్రభుత్వం 100 మంది వరకు అనుమతి ఇవ్వగా, పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మించకూడదని తెలిపింది.