స్కూళ్ల పునప్రారంభంపై న్యూ షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ సర్కార్..!

Thursday, October 29th, 2020, 10:03:43 PM IST


ఏపీలో నవంబర్ 2 నుంచి విద్యాసంస్థలను పున: ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సిద్దమయ్యింది. ఈ మేరకు ప్రభుత్వం కొత్త షెడ్యూలును విడుదల చేసింది. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని నవంబర్ 2 నుంచి 9, 10 విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించబోతునట్టు అందులో పేర్కొన్నారు.

అయితే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఓకరోజు క్లాసులు నిర్వహిస్తే, సెకండియర్ విద్యార్థులకు మరుసటి రోజు క్లాసులు నిర్వహించబోతున్నట్టు తెలిపారు. అయితే స్కూల్ విద్యార్థుల మాదిరిగానే ఇంటర్ విద్యార్థులకు కూడా ఒంటిపూట వరకే తరగతులను నిర్వహించబోతున్నట్టు తెలిపారు. ఇక నవంబర్ 23 నుంచి 6,7,8 వ తరగతి విద్యార్థులకు డిసెంబర్ 14 నుంచి 1, 2, 3, 4, 5వ తరగతి విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కానున్నట్టు తెలిపారు. అయితే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇదే షెడ్యూల్ వర్తించనున్నట్లు అధికారులు ప్రకటించారు.