ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి రామచంద్రమూర్తి రాజీనామా..!

Tuesday, August 25th, 2020, 06:10:24 PM IST

ఏపీ ప్రభుత్వ ప్రజా విధానాల సలహాదారుగా ఉన్న రామచంద్రమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. సీనియర్ జర్నలిస్ట్‌గా, పలు పత్రికలకు ప్రధాన సంపాదకులుగా పని చేసిన అనుభవం ఉన్న రామచంద్రమూర్తిని వైపీసీ అధికారంలోకి వచ్చాక ప్రజా విధానాల సలహాదారు పదవిలో నియమించింది.

అయితే రామచంద్రమూర్తితో పాటు ప్రభుత్వంలో ఇప్పటికి 33 మంది సలహాదారులను నియమించగా, వారిలో పది మందికి కేబినెట్‌ హోదా కూడా కల్పించింది. అయితే తాజాగా రామచంద్రమూర్తి రాజీనామా లేఖను ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లంకు సమర్పించారు. వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేసినట్లు రామచంద్రమూర్తి వెల్లడించారు.