కరోనా నిబంధనలపై ఏపీ సర్కార్ కొత్త ఆదేశాలు..!

Friday, March 19th, 2021, 02:16:28 AM IST


ఏపీలో రోజు రోజుకు మళ్ళీ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం మరోసారి కోవిడ్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేసేందుకు సిద్దమయ్యింది. పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో కోవిడ్ నిబంధనల్ని సమగ్రంగా అమలు చేయాలని మరోమారు ఆదేశాలు జారీ చేసింది. కరోనా రెండో దశ వ్యాప్తి చెందుతుందని నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

అంతేకాదు అవకాశం మేరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని మరో మారు అవలంభించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రవాణా వాహనాలు, యంత్రాలు, ప్రాంగణాల్ని ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలని, పరిశ్రమలు, దుకాణాల్లోకి ప్రవేశించే సమయంలో థర్మల్ స్కానింగ్ తప్పక చేయాలని సూచించింది. ఇక మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం విధిగా పాటించేలా చూడాలని ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది.