ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్.. తగ్గిన మద్యం ధరలు..!

Friday, October 30th, 2020, 01:42:43 AM IST


ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొన్ని రోజుల క్రితం మద్యం ధరలను తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లిక్కర్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను జారీచేసింది. గతంలో చీప్ లిక్కర్లపై ధరలు తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మీడియం, ప్రీమియం బ్రాండ్ల రేట్లను 25 శాతం మేర తగ్గించింది. అయితే తగ్గించిన ధరలు రేపటి నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించింది.

అయితే 50 నుంచి 1350 వరకు వివిధ కేటగిరీల్లో మద్యం ధరలను తగ్గించారు. అయితే 250 నుంచి 300 ఉన్న మద్యం బాటిల్‌పై 50 రూపాయల మేర తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే లాక్‌డౌన్ సడలింపుల అనంతరం మద్యం షాపులు తెరుచుకున్న సమయంలో ప్రభుత్వం 75 శాతం మద్యం ధరలను పెంచి ఒక్కసారిగా మద్యంప్రియులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగిపోవడంతో మద్యంపై 30 నుంచి 40 శాతం మేరకు మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.