ఏపీలో వాహనదారులకు షాక్.. నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక అంతే..!

Thursday, October 22nd, 2020, 12:02:19 AM IST

ఏపీలో వాహనదారులకు షాక్ ఇచ్చేలా సీఎం జగన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహేశ్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాలో రూల్స్ పాటించని వాహనదారులకు సీఎం భరత్ ఏ విధంగా అయితే భారీ జరిమానాలు విధిస్తాడో అలాంటి సీన్ ఇప్పుడు ఏపీలో రిపీట్ కాబోతుంది. ఇకపై వాహనదారులు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ఉల్లంఘనలపై జరిమానాలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

కొత్తగా పెంచిన జరిమానాలు ఇవే:

* బైక్‌ నుంచి 7 సీటర్‌ వాహనాల వరకు ఒకే విధమైన జరిమానా
* వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే రూ.750
* సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే రూ.750
* అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే రూ.5000
* తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే రూ.5000
* రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే రూ.5000
* డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే రూ.10000
* రేసింగ్ చేస్తూ మొదటిసారి పట్టుబడితే రూ.5000, రెండో సారి పట్టుబడితే రూ.10000
* సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ చేస్తే రూ.10000
* వేగంగా బండి నడిపితే రూ.1000
* పర్మిట్ లేని వాహనాలు నడిపితే రూ.10000
* రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా మొదటిసారి పట్టుబడితే రూ.2000, రెండో సారి రూ.5000
* ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.10000
* అనవసరంగా హారన్ మోగించినా మొదటిసారి రూ.1000, రెండోసారి రూ.2000 జరిమానా