రేషన్ డోర్ డెలివరీదారులకు గుడ్‌న్యూస్ అందించిన జగన్ సర్కార్..!

Saturday, February 6th, 2021, 09:04:30 AM IST

ఏపీ ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీ చేసేందుకు ప్రత్యేక వాహనాలను చేయించింది. అయితే ప్రభుత్వం ఇస్తున్న జీతాలకు తాము ఇంటింటికి తిరిగి రేషన్ అందించలేమని పలుచోట్ల వాహనాల డ్రైవర్లు నిరసనలు వ్యక్తం చేశారు. ఏదో ఉపాధి దొరుకుతుందని అనుకుంటే ఇలా గొడ్డు చాకీరీ చేయాల్సి వస్తుందని అనుకోలేదని వారు అన్నారు. హెల్పర్లు 3 వేలకు ఎవరూ రావడం లేదని దీంతో తామే వాహనాలు నడుపుతూ మూటలు మోయాల్సి వస్తుందని వాపోయారు.

అయితే వారి ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం దీనిపై తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా ఒక్కో వాహనదారుడికి ఇకనుంచి రూ.21 వేలు చెల్లిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం అద్దెకింద రూ.10 వేలు, పెట్రోల్‌కు రూ.3 వేలు, హెల్పర్ ఛార్జీలకు రూ.3 వేలు అందచేస్తున్నారు. అయితే ఇకపై అద్దె కింద రూ.13 వేలు, హెల్పర్ ఛార్జీలకు రూ.5 వేలు, పెట్రోల్‌కు గతం మాదిరిగానే రూ.3 వేలు కలిపి మొత్తం రూ.21 వేలు చెల్లించబోతుంది.