ఆ యాప్ ప్రైవేట్ యాప్.. నిమ్మగడ్డపై మరోసారి కోర్టుకెళ్లిన జగన్ సర్కార్..!

Wednesday, February 3rd, 2021, 05:30:30 PM IST

ఏపీలో పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమీషన్‌కు మధ్య మొదలైన వివాదం ఇంకా సర్ధుమనగడంలేదు. ఎన్నికలను పూర్తి పాదర్శకంగా నిర్వహించేందుకు ఎస్ఈసీ ఏ-వాచ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. పంచాయితీ ఎన్నికలకు సంబంధించి యాప్ ద్వారా ఎలాంటి ఫిర్యాదులనైనా ఎస్ఈసీ దృష్టికి తీసుకురావచ్చని ఎస్ఈసీ తెలిపింది. అయితే ఈ యాప్‌ను నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

అంతేకాదు ప్రభుత్వంతో సంప్రదించకుండా యాప్ రూపొందించారని, భద్రతాపరమైన అనుమతులు లేకుండా యాప్‌ను రహస్యంగా తయారు చేశారని పిటీషన్‌లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి చాలా యాప్‌లు ఉన్నాయని ఇప్పుడు కొత్తగా మరో యాప్‌ను డిజైన్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. అయితే ఈ లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణకు అంగీకరించని కోర్టు, రేపు దీనిపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది.