సీఎం జగన్ డిసీషన్.. కరోనాతో అనాథలైన పిల్లలకు రూ.10 లక్షలు..!

Monday, May 17th, 2021, 11:05:21 PM IST

కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను చిదిమేస్తుంది. కుటుంబాన్ని నడిపించే పెద్ద చనిపోతుండండంతో చాలా కుటుంబాలు ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదురుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఒకే కుటుంబలో కరోనా బారిన పడి దంపతులు ఇద్దరు చనిపోతుండడంతో వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. అలాంటి వారికి మేమున్నామని చేర‌దీసేవారే కరువయ్యారు. దీంతో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

నేడు కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌, కర్ఫ్యూ పెంపు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌ కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథ‌లైన చిన్నారుల పేరుపై రూ.10‌ లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అంతేకాదు ఈ మొత్తంపై వ‌చ్చే వ‌డ్డీని ఆ చిన్నారులు అవసరాల కొరకు నెల‌నెల తీసుకునే వీలు క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ చిన్నారుల‌కు 20 ఏళ్లు నిండిన త‌ర్వాత ఎఫ్‌డీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించాలని సీఎం జగన్ సూచించినట్టు తెలుస్తుంది.