ఎస్వీబీసీకి కొత్త చైర్మన్‌ని నియమించిన ఏపీ సర్కార్..!

Wednesday, October 28th, 2020, 09:16:46 PM IST

శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌కు ఏపీ సర్కార్ కొత్త చైర్మన్‌ను నియమించింది. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యచేంద్రను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది.

ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్వీబీసీ చైర్మన్‌గా నటుడు 30 ఇయర్స్ పృథ్వీనీ నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఎస్వీబీసీలో పనిచేసే ఓ ఉద్యోగినితో పృథ్వీ జరిపిన సరస సంభాషణల ఆడియో టేప్ బయటకు రావడంతో స్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి పృథ్వీనీ తప్పించాలని శ్రీవారి భక్తులు, నెటిజన్లు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్ అవ్వడంతో, ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని పృథ్వీరాజ్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. దీంతో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీరాజ్ ఈ ఏడాది జనవరి 12న రాజీనామా చేశారు.