ఆ నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపిన గవర్నర్‌ విశ్వభూషణ్‌..!

Thursday, December 24th, 2020, 08:45:43 AM IST

ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రభుత్వం పంపించిన నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీ నుంచి ఆమోదం పొందిన నాలుగు బిల్లులకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ సంతకాలు చేశారు. దీంతో ఆ బిల్లులు ఇప్పుడు చట్టాలుగా మారాయి. ఏపీ ఫిష్‌ ఫీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ యాక్ట్‌-2020, వ్యవసాయ భూముల మార్పిడి సవరణ చట్టం-2020, ఎఫ్‌ఆర్‌బీఎం సవరణ చట్టం-2020, స్టేట్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ యాక్ట్‌-2020లకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయడంతో వాటిని గజిట్‌లో ప్రచురిస్తూ న్యాయశాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది.