అంతర్వేది ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్ డెసిషన్!

Wednesday, September 9th, 2020, 03:03:50 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ పై జన సేన, తెలుగు దేశం, బీజేపీ ల తో పాటుగా పలు పార్టీ లు వరుస విమర్శలు చేస్తున్నారు. అయితే తూర్పు గోదావరి జిల్లాలో అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం లో ఉన్న 62 ఏళ్ల నాటి రథం దగ్ధం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతి పక్ష పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈఓ ను సస్పెండ్ చేస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర ఒక ప్రకటన లో వెల్లడించారు. అయితే ఈ ఆలయానికి ఈఓనియమితులు అయ్యే వరకు అన్నవరం దేవస్థానం కి ఈఓ గా వ్యవహరిస్తున్న వారే అదనపు బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే ఈ ఘటన పై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ప్రమా దవశత్తూ జరిగిందా, లేదంటే విద్రోహ చర్య అనే దిశగా విచారణ చేస్తున్నారు.