ఏపీ ప్రభుత్వం మద్యం ధరల పై మరో కీలక నిర్ణయం

Thursday, September 3rd, 2020, 11:05:38 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మధ్యం ధరల పై మొదటి నుండి విమర్శలు వస్తూనే ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ నేతలు, అధికార పార్టీ తీరు పై ఘాటు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం ప్రియులకు ఇది తీపి వార్తే అని చెప్పాలి. మద్యం ధరలను ప్రభుత్వం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది లిక్కర్, బీర్, వైన్ ధరలను క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకుంది.

అయితే పలు మార్పులను తీసుకు రావడం జరిగింది. 150 రూపాయల కంటే తక్కువ ధర ఉన్న బ్రాండ్ ల పై ధరలను తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే 90ml 190 రూపాయల నుండి 600 రూపాయల వరకు ఉన్న మద్యం పై ధరలను పెంచడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై పలువురు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు మాత్రం దీని పై పలు చర్చలను చేపట్టారు.