కరోనా వైరస్ కట్టడికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

Friday, March 26th, 2021, 01:53:20 PM IST

Corona

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మళ్ళీ కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత పెరిగి పోతుంది. ఊహించని రీతిలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంటోంది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడం తో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న జిల్లాల అధికారులతో మంత్రి ఆళ్ళ నాని సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా లలో ఆసుపత్రులను సిద్దం చేయాలని సూచించారు. అయితే జిల్లాలకు సర్వే బృందాలను పంపాలని ఆదేశించారు. అయితే మూడు రాష్ట్రాలకు సమీపం లో ఉన్నటువంటి చిత్తూరు లో కేసులు ఎక్కువ ఉన్నాయి అని, అక్కడి వారికి చికిత్స అందిస్తున్నామని, ఇంకా బెడ్ల సంఖ్య పెంచాలని సూచించారు.