అంతర్వేది ఘటన పై సీబీఐ దర్యాప్తు కి సీఎం జగన్ ఆదేశం

Friday, September 11th, 2020, 12:58:44 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాలో అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రథం దగ్ధం పై రాజకీయ పార్టీ నేతలు, సంఘాలు, ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీని పై ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది అంటూ వారు ఆరోపిస్తున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఇప్పటికే దీని పై దర్యాప్తు చేపట్టారు. ఆలయ ఈఓ ను సస్పెండ్ కూడా చేయడం జరిగింది.

అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణ కి అయినా సిద్దం అంటూ స్పష్టం చేసింది. అయితే ప్రతి పక్ష పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు, సోషల్ మీడియా లో వస్తున్న పలు అసత్య ప్రచారాలకి జగన్ సర్కార్ చెక్ పెట్టేందుకు సిద్దం అయింది. అయితే ఈ ఘటన పై సీబీఐ దర్యాప్తు కోరుతూ డీజీపీ కార్యాలయం కేంద్ర హోమ్ శాఖ కి లేఖ పంపడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన జీఓ రేపు వెలువడే అవకాశం ఉంది. ప్రతి పక్ష పార్టీ నేతలు అనుకున్నట్లుగా సీబీఐ దర్యాప్తు చేపట్టే అవకాశం ఉండటం తో దీనికి సంబంధించిన కారకులు ఎవరో త్వరలో తెలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.