ఏపీ లో పెరుగుతున్న కరోనా కేసులు…రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!

Monday, March 22nd, 2021, 04:09:17 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరుగుతోంది. ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం పట్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుండి పదవ తరగతి వరకూ కూడా ఒంటిపూట బడులు ఉంటాయి అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. అయితే ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఇది అమలు అవుతుంది అని చెప్పుకొచ్చారు. ఉదయం 7:45 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతుల అనంతరం మధ్యాహ్న భోజనం యధావిధిగా ఉంటుంది అని స్పష్టం చేశారు. అయితే ఇందుకు గల కారణాలను మంత్రి తెలిపారు.

రాష్ట్రం లో పెరుగుతున్న కరోనా కేసులు మరియు ఎండల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే పాటశాల నుండి విద్యార్థులు ఇళ్లకు క్షేమంగా వెళ్ళడం పై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలి అని వ్యాఖ్యానించారు. పాటశాలల్లో కరోనా వైరస్ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.