విశాఖ లో జపనీస్ ఎన్ క్లేవ్ నిర్మాణం

Sunday, December 20th, 2020, 05:03:50 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశాఖ లో జపనీస్ ఎన్ క్లేవ్ నిర్మాణం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. విశాఖ లో వైద్యం, విద్య వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పది లక్షల చదరపు అడుగుల్లో జపనీస్ ఎన్ క్లెవ్ నిర్మాణం ఉండనుంది అని వైసీపీ అధికారిక సోషల్ మీడియాలో వెల్లడించింది.

అంతేకాక చెన్నై, బెంగళూరు కారిడార్ లో భాగంగా కృష్ణ పట్నం వద్ద పారిశ్రామిక పార్క్ అభివృద్ధి కి 1,300 కోట్ల రూపాయల తో జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజెన్సీ ముందుకు వచ్చిన విషయాన్ని వెల్లడించారు. అయితే దీని ద్వారా 18,548 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే పెట్టుబడుల ప్రతిపాదనకు పరిశీలించి అనుమతులు ఇచ్చే విధంగా జపాన్ డెస్క్ ను ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. మంత్రి గౌతం రెడ్డి సదస్సులో పాల్గొన్న ఫోటో లను వైసీపీ తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.