సమగ్ర భూ సర్వేపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

Tuesday, September 1st, 2020, 12:59:55 AM IST

YS_Jagan
ఏపీలో సమగ్ర భూసర్వే చేయాలని జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక సమగ్ర భూసర్వే చేయాలని భావించింది. అయితే ఇన్ని రోజుల తరువాత ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. జనవరి 1, 2021 నుంచి సమగ్ర భూసర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2023 ఆగస్ట్ నాటికి ఈ సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే అర్బన్‌ ప్రాంతాల్లోనూ సమగ్ర భూసర్వే నిర్వహించాలని, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామసభలను ఏర్పాటు చేసి సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇదిలా ఉంటే భూవివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యునల్స్‌ కూడా ఏర్పాటు చేశారు. ఇకపై భూ వివాదాలు ఏమైనా ఉంటే అక్కడిక్కడే పరిష్కారం అయ్యేలా దృష్టి పెట్టాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే దీనికోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న సర్వే సిబ్బందితో పాటు ఔట్ సోర్సింగ్ పద్దతిలో సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.