ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కి ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయింపు

Friday, September 4th, 2020, 10:11:48 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కుర సాల కన్నబాబు కి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ను కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల రీత్యా ఇంటెలిజెన్స్ నివేదిక మేరకు హోమ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పది రోజుల క్రితం ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక పై ప్రయాణాలు, పర్యటన లు చేపట్టాలి అంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేస్తున్నారు.