సుప్రీంలో నేడు పంచాయతీ ఎన్నికల పిటిషన్ పై విచారణ

Monday, January 25th, 2021, 09:01:25 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలి అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటిషన్ కి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అనుకూలం గా తీర్పు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. వాక్సినేషన్ మరియు స్థానిక సంస్థల ఎన్నికలు రెండు కూడా ముఖ్యమైనవి అంటూ ఉన్నత న్యాయస్థానం చెప్పుకొచ్చింది. అయితే రాష్ట్ర హైకోర్టు తీర్పు ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ను ఆశ్రయించింది.

నేడు సుప్రీం కోర్టులో పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై విచారణ జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకి జస్టిస్ సంజయ్ కిషన్ నేతృత్వంలో ఉన్నత న్యాయస్థానం విచారణ జరగనుంది. ఎన్నికల పై హైకోర్టు తీర్పు ను నిలిపి వేయాలని ప్రభుత్వంపిటిషన్ దాఖలు చేసింది. అయితే ప్రజల ఆరోగ్యం, ఉద్యోగుల ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరనుంది. అయితే నేడు ఈ మొత్తం వ్యవహారం పై సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది.