ఏపీ లో ఆసరా పథకం కింద ఇచ్చే రూ.2 వేల ఆర్థికసాయం నిలిపివేత

Sunday, September 6th, 2020, 09:27:36 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. గత కొద్ది రోజులుగా పది వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కరోనా వైరస్ బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతష్టాత్మకంగా ఆసరా పథకాన్ని అమలు చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ పథకాన్ని నిలిపి వేసినట్లు తెలుస్తోంది. ఆసరా పథకం కింద బాధితులకు 2 వేల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే కేసుల పెరుగుదల తో ఆర్ధిక భారం పెరిగినట్లు అధికారులలు చెబుతున్నారు.

అయితే ఆర్థిక భారం పెరుగుదల చేత ఈ సాయాన్ని తాత్కాలికం గా నిలిపివేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే మొదటి మూడు నెలల్లో 20 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం చెల్లించినట్లు ప్రాథమిక సమాచారం. అయితే డిశ్చార్జ్ అయిన వారి వద్ద నుండి బ్యాంక్ అకౌం ట్ వివరాలు తీసుకుంటున్నా, డబ్బులు మాత్రం జమ చేయడం లేదు అని తెలుస్తుంది. కరోనా నుండి కోలుకున్న అనంతరం పౌష్టిక ఆహారం ను తీసుకొనేందుకు వీలు గా రెండు వేల ఆర్థికసాయం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇపుడు ఆర్థిక భారం అవుతుండటం తో నిలిపివేసినట్లు తెలుస్తుంది.