చంద్రబాబు ఇకనైనా నీచ రాజకీయాలు మానుకోవాలి – శ్రీకాంత్ రెడ్డి

Wednesday, March 17th, 2021, 07:34:47 AM IST

సీఐడీ అధికారులు చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఇవ్వడం పట్ల వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు ఇకనైనా నీచ రాజకీయాలు మానుకోవాలి అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సంక్షేమం మరియు అభివృద్ధి ను రెండు కళ్ళలా చేసుకొని సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అందుకే మునిసిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ను ప్రజలు అఖండ మెజారిటీ తో గెలిపించారు అని వ్యాఖ్యానించారు. అయితే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి ప్రచారం లేకుండా స్పందించిన వ్యక్తి జగన్ అని, అందుకే ఆయన పై ప్రజల్లో విశ్వాసం పెరిగింది అంటూ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల శ్రీకాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల వ్యవహారం లో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం అని అన్నారు. ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికల కమిషనర్ పై ఎలాంటి వ్యక్తి గత దేశం లేదని, ఓ రాజకీయ పార్టీ తో హోటల్ లో భేటీ అవ్వడాన్ని, ఓ పార్టీ కి కొమ్ము కాయడాన్ని నిలదీశామని చెప్పుకొచ్చారు. 2019 లో జగన్ గెలిచినప్పుడు ఈ వీ ఎం లు మోసం చేశాయని చంద్రబాబు నాయుడు అన్నారు అని చెప్పుకొచ్చారు. అయితే బ్యాలెట్ తో, పార్టీ గుర్తు తో జరిగిన పురపాలక ఎన్నికల్లో వైసీపీ కి అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎక్కువ మెజారిటీ వచ్చింది అని అన్నారు. అయితే బాబు కి స్టే ల బాబు అని పేరుంది అని, చిత్త శుద్ధి ఉంటే ఇప్పటికైనా విచారణ కి సిద్ధపడాలి అంటూ చెప్పుకొచ్చారు.