బిగ్ న్యూస్: ఏపీ లో రేపటి నుండి థియేటర్లు తెరవడం లేదు

Wednesday, October 14th, 2020, 05:28:40 PM IST

కేంద్ర ప్రభుత్వం ఇటీవల అన్ లాక్ 5.0 కి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అక్టోబర్ 15 నుండి థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చు అని తెలిపింది. 50 శాతం అక్యుపెన్సీ తో ధియేటర్ లను ఓపెన్ చేసుకోవాలనీ షరతు పెట్టింది. అయితే ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ధియేటర్ యాజమాన్యాలు ఒక కీలక ప్రకటన చేశాయి. రేపటి నుండి అనగా అక్టోబర్ 15 నుండి థియేటర్లు తెరవడం లేదు అని తెలిపింది.

విజయవాడ లో ఆంధ్ర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లూ ఈ మేరకు సమావేశం అయ్యారు. లాక్ డౌన్ పీరియడ్ లో కరెంట్ బిల్లులను మాఫీ చేయిస్తాం అని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది అని, కానీ ఇప్పటి వరకు మాఫీ చేయలేదు అని, మా సమస్యల పై దృష్టి పెట్టలేదు అని, రేపటి నుండి థియేటర్లను ఓపెన్ చేసే ప్రసక్తే లేదు అని ఎగ్జిబిటర్స్ చీఫ్ కే ఎస్ ప్రసాద్ అన్నారు. సెక్రెటరీ రమేష్ సైతం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క ధియేటర్ పైనే 7 నెలలకు కలిపి 4 లక్షల రూపాయల కరెంట్ బిల్లు వేశారు అని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు నడిపిస్తే 10 లక్షల కరెంట్ బిల్లు వస్తుంది అని అన్నారు. అయితే కరెంట్ బిల్లు మాఫీల పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వీలైనంత త్వరగా థియేటర్లు ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తాం అని, సీట్ల కెపాసిటీ విషయం లో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని సూచించారు.