వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుండి ఆ రథాన్ని వాడలేదు – ఏపీ దేవాదాయ శాఖ మంత్రి

Wednesday, September 16th, 2020, 09:08:51 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పలు చోట్ల దేవాలయాల్లో జరుగుతున్న సంఘటన లతో ఇటు అధికార పార్టీ, ప్రతి పక్ష పార్టీలు వీటి పై స్పందిస్తున్నారు. తాజాగా విజయవాడ లోని దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో వెండి రథం పై ఉన్నటువంటి మూడు సింహాలు కనిపించడం లేదు అని, పరిశీలన లో తేలింది అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. అయితే రథానికి ముందు వెనుక ఉండాల్సిన నాలుగు సింహల్లో ఒకటి మాత్రమే ఉంది అని, మిగతా మూడు అదృశ్యమైనట్లు తెలిపారు.

అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఆ రథాన్ని ఉపయోగించడం లేదు అని స్పష్టం చేశారు. అయితే ఈ పని గత ప్రభుత్వ హయాంలో జరిగిందా లేకపోతే ఇప్పుడు జరిగిందా అనే విషయాలు విచారణ లో తేలుతాయి అని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ ఘటన పై కమిటీ వేసి విచారణ జరిపిస్తామని, విచారణలో నిజాలు తెలుస్తాయి అని అన్నారు. అయితే చాలా ఆలయాల్లో ప్రైవేట్ ఏజెన్సీ లు భద్రత విషయం ను చూసుకుంటున్నాయి అని, వాటి లోపం అని తెలిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ విషయంలో ప్రతి పక్ష పార్టీ లు అనవసరం గా రాద్దాంతం చేస్తున్నాయి అని మంత్రి వ్యాఖ్యానించారు.