బిగ్ న్యూస్: చట్టపరంగా తగిన బుద్ది చెపుతాం… జేసీ కి డీఎస్పీ వార్నింగ్!

Saturday, August 8th, 2020, 12:08:56 AM IST


జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ పై విడుదల అలా అయ్యారో లేదో, నేడు మళ్లీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసుల పై దురుసుగా ప్రవర్తించిన జేసీ తీరు పై డీఎస్పీ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జేసీ కి వార్నింగ్ ఇచ్చారు. నిజాయితీ గా పని చేస్తున్న పోలీసుల పై దాడి చేస్తే ఊరుకోబోమని, పోలీసుల మనో భావాలు దెబ్బ తీసేలా ప్రవర్తిస్తే సహించేది లేదు అని, చట్టపరంగా నే తగిన బుద్ది చేపుతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.

బెయిల్ పై జైలు నుండి విడుదల అనంతరం జేసీ 500 మంది తో ఊరేగింపు జరిపారు అని, నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా కాల్చారు అని, అందుకు సంబంధించిన వీడియో క్లిప్స్, ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు అని వ్యాఖ్యానించారు. ర్యాలీ నిర్వహించ వద్దు అని డీఎస్పీ నిన్ననే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అయిన వినలేదు అని అన్నారు. దేవేంద్ర పై దురుసుగా ప్రవర్తించ డం మాత్రమే కాక, లాక్ డౌన్ నిబంధనలు కూడా ఉల్లంఘించిన విషయాన్ని వెల్లడించారు.