సోషల్ మీడియా వినియోగదారులకు ఏపీ డీజీపీ హెచ్చరిక..!

Thursday, June 4th, 2020, 02:42:32 AM IST


సోషల్ మీడియా వినియోగదారులకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం వ్యవహరిస్తే కుదరదని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసే వార్తలు అవాస్తవాలైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అయితే ఇకమీదట ప్రభుత్వంపై గానీ, ప్రభుత్వ అధికారుపై గానీ కించపరిచే వ్యాఖ్యలు చేస్తే కేసులు నమోదు చేస్తామని, ఒకరిని కించపరుస్తూ పోస్ట్‌లు చేసినా, ఆ తర్వాత డిలీట్ చేసినా డిలీట్ చేసిన పోస్ట్‌లు, మెసేజ్‌లను గుర్తించే టెక్నాలజీ తమ వద్ద ఉందని తప్పు చేసినట్టు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తప్పవని అన్నారు.