ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్..!

Monday, May 10th, 2021, 09:21:52 PM IST

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలే కాకుండా ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు కూడా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే ఆమె భర్త వైసీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షుడు పరిక్షిత్‌ రాజుకు కూడా కరోనా బారిన పడ్డారు. అయితే ప్రస్తుతం తాము బాగానే ఉన్నామని, ఇటీవల మా దంపతులను కలిసిన వారెవరైనా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, ప్రతి ఒక్కరు సరైనా జాగ్రత్తలు పాటించాలని వారు కోరారు. ఇదిలా ఉంటే కర్నూల్ జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి కూడా నేడు కరోనా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఎమ్మెల్యే హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు.