రఘురామ కృష్ణంరాజు ఎవరో జనానికి తెలియదు – డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

Saturday, August 15th, 2020, 07:05:37 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వైసీపీ కి ప్రతి పక్ష పార్టీ నేతలతో మాత్రమే కాకుండా, సొంత పార్టీ కి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేస్తున్న వ్యాఖ్యలు తలనొప్పి ను తెచ్చి పెడుతున్నాయి. అయితే తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు వైసీపీ లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. తాను ఎవరి దయ వల్ల గెలవలేదు అని, జగన్ ఫోటో ను వాడుకోలేదు అని చేసిన వ్యాఖ్యలకు గానూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రఘురామ కృష్ణంరాజు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని ఎంపీ సీటు తెచ్చుకున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. రఘురామ కృష్ణంరాజు ఎవరో జనానికి తెలియదు అని, వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ మీదే రఘురామ కృష్ణంరాజు ఎంపీ గా గెలిచారు అని అన్నారు. అంతేకాక ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నారాయణ స్వామి డిమాండ్ చేశారు. రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ వ్యాఖ్యలు చేయడం తో ఇపుడు ఎంపీ ఎలా స్పందిస్తారు అనే దాని పై రాష్ట్రం లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి.