ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు…నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఏపీ సీఎస్ లేఖ

Wednesday, November 18th, 2020, 08:31:49 AM IST

కరోనా వైరస్ మహమ్మారి కారణం గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ ఫిబ్రవరి మాసం లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. అయితే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సి ఎస్ నీలం సాహ్నీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ రాయడం జరిగింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి రాష్ట్రాలు వాటి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాయి అని తెలిపారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదు అని అభిప్రాయ పడ్డారు. చలికాలం లో మరింత అప్రమత్తత అవసరం అని కేంద్ర హెచ్చరించిన విషయాన్ని సి ఎస్ లేఖ లో ప్రస్తావించారు. కరోనా వైరస్ మహమ్మారి కారణం గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 6,890 మంది ప్రాణాలను కోల్పోయారు అని గుర్తు చేశారు. అయితే మరోసారి కరోనా ప్రబలే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు అని స్పష్టం చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్టే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అన్నారు.

అయితే ఈ మహమ్మారి కట్టడికి ఇప్పటికే పరిపాలన సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు కృషి చేస్తున్నారు అని, అయితే రాష్ట్ర ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఫిబ్రవరి లో ఎన్నికలు నిర్వహించాలి అని అనుకోవడం సరైన నిర్ణయం కాదు అని అన్నారు. ఎన్నికల నిర్వహణ పై మీ నిర్ణయం పునరాలోచన చేయాలని సూచించారు.