ప్రధాని మోడీ కి మద్దతుగా సీఎం జగన్ వ్యాఖ్యలు

Friday, May 7th, 2021, 05:37:26 PM IST


భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఊహించని రీతిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. అయితే ఇందుకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనా విధానం ను సైతం విమర్శిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ పై చేసే పోరు లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోడీ కి చెప్పేది వినడం లేదు అంటూ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ట్వీట్ చేశారు. అయితే సోరేన్ చేసిన ట్వీట్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రీ ట్వీట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రధాని నరేంద్ర మోడీ కి అండగా నిలవాల్సిన సమయం అని చెప్పుకొచ్చారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ కి మద్దతుగా సీఎం జగన్ వ్యాఖ్యలు ఉండటం తో సర్వత్రా ఈ అంశం పై చర్చ జరుగుతుంది.