బిగ్ న్యూస్: సీఎం జగన్ మరొక కీలక నిర్ణయం

Wednesday, December 9th, 2020, 04:47:04 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియా తో ఎం ఓ యూ కుదుర్చుకుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం లో భూములు రీ సర్వే చేసేందుకు సిబ్బందికి అవసరమైన శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు సీఎం జగన్.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇక పై ఎలాంటి భూ సమస్యలు కూడా తలెత్తవు అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పటికే ఎన్నో విప్లవాత్మక మార్పుల శ్రీకారం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తుందగా, ఈ నిర్ణయం పై ప్రతి పక్ష పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.