రాపాక ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి జగన్!

Wednesday, January 22nd, 2020, 07:25:19 AM IST

2019 ఎన్నికల్లో భారీ మెజారిటీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముక్యమంత్రి జగన్ జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వైసీపీ 2019 ఎన్నికల్లో దాదాపు అన్ని ఎస్సి నియోజక వర్గాల్లో క్లీన్ స్వీప్ చేసిందని గుర్తు చేసారు. అయితే రెండు ఎస్సి నియోజకవర్గాల్లో ఒకటి టీడీపీ మరొకటి జనసేన పార్టీ నుండి గెలిచారని గుర్తు చేసారు. అయితే ఎస్సి, ఎస్టీ, మైనార్టీలకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా మద్దతు తెలిపే అవకాశం ఉందని జగన్ అన్నారు.

ఎస్సి, ఎస్టీ, మైనారిటీ, పేద వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మద్దతు పలుకుతున్నారని జగన్ అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ను చూసి ఎస్సిలందరూ ఎందుకు ఓటేశామా? అని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఎస్సి, ఎస్టీ ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయాలన్నది చారిత్రాత్మక నిర్ణయం అని, కానీ టీడీపీ మాత్రం ఆ బిల్లును అడ్డుకుందని అన్నారు. చంద్రబాబు తో సహా టీడీపీ ఎమ్మెల్యే ల దిక్కుమాలిన వైఖరి అని విమర్శలు గుప్పించారు.