స్వార్థం కోసం చంద్రబాబు వ్యవస్థలను సర్వ నాశనం చేస్తున్నారు

Wednesday, November 4th, 2020, 05:45:31 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మరొకసారి తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఘాటు విమర్శలు చేశారు. స్వార్థం కోసం చంద్రబాబు వ్యవస్థలను సర్వ నాశనం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం నాడు హై కోర్ట్ లో అఫిడవిట్ వేసినట్లు పత్రిక లో వచ్చింది అని, హై కోర్ట్ కి నిన్ననే ఈసీ నివెడించినట్లు నిన్న పత్రికలో వచ్చింది అని, కానీ హైకోర్టు లో అఫిడవిట్ ఈరోజు ఫైల్ అయినట్లు ఉంది అని, ముందుగా పత్రికలకి ఎందుకు లీక్ చేశారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటువంటి వ్యకి నిజాయితీ గా ఎలా వ్యవహరిస్తారు అని, ఎలా నమ్మాలి అని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఈ మేరకు చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నిమ్మగడ్డ పని చేస్తున్నట్లు తేలింది అని ఆరోపించారు. సొంత ప్రయోజనాల కోసం, స్వార్థం కోసం వ్యవస్థలను తాకట్టు పెడుతున్నారు అని, అఫిడవిట్ కి సంబందంచిన పత్రాలను మీడియా కి ఎందుకు ఇచ్చారు అని మండిపడ్డారు. అంతేకాక రోజుకి రెండు కేసులు వస్తున్నప్పుడు వాయిదా వేసిన నిమ్మగడ్డ ఇప్పుడు మూడు వేల కేసులు వస్తుంటే ఎలా నిర్వహిస్తారో చెప్పాలి అని శ్రీకాంత్ రెడ్డి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను డిమాండ్ చేశారు.

అయితే గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వివేది ను చంద్రబాబు బెదిరించారు అని, రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించే తత్వం చంద్రబాబు కి లేదు అని, చంద్రబాబు చెప్పినట్లు గా రమేష్ కుమార్ పని చేస్తున్నారు అని ఆరోపించారు. ఇంట్లో నుండి బయటికి రాని నాయకుడు చంద్రబాబు అని, ఇంట్లో కూర్చొని జూమ్ మీటింగ్ ల ద్వారా ప్రభుత్వం పై బురద జల్లుతున్నారు అని అన్నారు. అంతేకాక చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పనులను అడ్డుకోవడం పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఘాటు విమర్శలు చేశారు శ్రీకాంత్ రెడ్డి.