ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..!

Friday, December 18th, 2020, 09:54:54 PM IST

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ భేటీలో రైతులు, సినీపరిశ్రమకు ఊరటనిచ్చే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. మూడో విడత రైతు భరోసా, నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సీడీ, కొత్త టూరిజం పాలసీకి ఆమోదం, భూసమగ్ర రీసర్వేకు ఆమోదం తెలిపింది. వీటితో పాటు సినిమా థియేటర్లకు విద్యుత్ బిల్లుల మాఫీతో పాటు రుణ సౌకర్యాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

కేబినెట్ నిర్ణయాలు:

* మూడో విడత రైతు భరోసా‌కు కేబినెట్‌ ఆమోదం
* రైతులకు రూ.719 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపుకు నిర్ణయం
* 1,100 సినిమా థియేటర్లకు రుణాలు, వడ్డీపై సబ్సిడీకి నిర్ణయం
* సినీ పరిశ్రమకు కూడా రీస్టార్ట్ ప్యాకేజీ అమలు
* ఏప్రిల్, మే, జూన్ కాలానికి పవర్ ఫిక్స్‌డ్ చార్జీల రద్దు
* రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు ఆమోదం
* ఏపీ అదనపు అడ్వొకేట్ జనరల్‌గా జాస్తి నాగభూషణం నియామకానికి ఆమోదం
* తిరుపతి వద్ద 40 ఎకరాల్లో సర్వే అకాడమీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
* ల్యాండ్ సర్వే, బౌండరీ చట్టంలో 5 సవరణలకు కేబినెట్ ఆమోదం