మెగాస్టార్ చిరంజీవి ను కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు!

Thursday, August 6th, 2020, 10:06:11 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే రాజధాని అంశం, కరోనా వైరస్ కట్టడి అంశాల పై అధికార పార్టీ పై ప్రతి పక్ష పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న తరుణంలో కొత్తగా బీజేపీ అధ్యక్షుడు గా ఎన్నికయ్యారు సోము వీర్రాజు. రాజధాని అంశం పై తనదైన శైలి లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి, టీడీపీ కి గట్టి కౌంటర్ ఇచ్చారు. అయితే భవిష్యత్ కార్యాచరణ పై బీజేపీ దృష్టి సారించింది అని, ఇక పై తమ దూకుడు చూపిస్తాం అని సోము వీర్రాజు తెలిపారు. అయితే తాజాగా సోము వీర్రాజు టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారిని ఆయన ఇంట్లోనే కలిశారు. కలవడం తో పాటుగా ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

అయితే సోము వీర్రాజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కి అధ్యక్షుడు గా నియామకం కావడం తో చిరు శుభాకాంక్షలు తెలిపారు. అయితే వీరిరువురు కూడా రాష్ట్ర, కేంద్ర రాజకీయాల పై దాదాపు రెండు గంటల పైనే మాట్లాడుకున్నారు. అంతేకాక జన సేన పార్టీ అధ్యక్షుడు, తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలిసి రాజకీయ భవిష్యత్ పై కూడా చర్చించారు. ప్రజా సమస్యల పై, ప్రజా సమస్యల పరిష్కారం పై కృషి చేస్తూ, 2024 లో బీజేపీ జన సేన పొత్తు పార్టీ అధికారం సాధించాలని చిరు ఆకాంక్షించారు. అయితే వీరిరువురి కలయిక కి తోడుగా నిర్మాత ఎస్ వి బాబు కూడా ఉన్నారు. అయితే సోము వీర్రాజు చిరు కలవడం పట్ల మరొకసారి రాష్ట్రం లో పలు చర్చలు మొదలు అయ్యాయి.