ఆ బిల్లు రైతులకు ఓ వరం – సోము వీర్రాజు

Wednesday, September 23rd, 2020, 01:35:32 AM IST

Somu_Veerraju
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు గా సోము వీర్రాజు బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులను సోము వీర్రాజు కలిశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో బీజేపీ ను బలోపేతం చేయాలి అని, భవిష్యత్ కార్యకలాపాలు నిర్వహించాలి అని జిల్లా అధ్యక్షులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. అయితే రాష్ట్రం లో బీజేపీ అధికారంలోకి రావడానికి పని చేస్తోంది అని తెలిపారు. అయితే అటల్ బిహారీ వాజపేయి తెలిపిన సమృద్ ఆంధ్ర లక్ష్యం తో ముందుకు సాగుతారు అని అన్నారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనేది బీజేపీ ఆలోచన అని స్పష్టం చేశారు. అయితే ఇటీవల నరేంద్ర మోడీ పార్లమెంట్ లో తీసుకు వచ్చిన వ్యవసాయ బిల్లు పై సోము వీర్రాజు స్పందించారు. వ్యవసాయ బిల్లు రైతులకు ఓ వరం అని, రైతుల పంటలను ఎక్కడైనా విక్రయించే అవకాశాన్ని మోడీ ఇచ్చారు అని ప్రశంసలు కురిపించారు. అయితే రైతులకు మద్దతు ధర కూడా గతంలో కంటే రెట్టింపు అవుతుంది అని తెలిపారు.