చంద్రబాబు పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటు విమర్శలు

Thursday, August 20th, 2020, 08:34:24 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో రాజధాని అంశం పై అధికార, ప్రతి పక్ష పార్టీ నేతలు ఒకరి పై మరొకరు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో లో చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధాని గా ఎన్నుకొన్న సంగతి తెలిసిందే. అప్పటి ప్రతి పక్ష నేత జగన్ మోహన్ రెడ్డి సైతం రాజధాని కి సానుకూలంగా స్పందించి, 30 వేల ఎకరాల భూమి అవసరం అని అన్నారు. అయితే నేడు అధికారం చేపట్టిన అనంతరం మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం జరిగింది.

అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం మూడు రాజధానుల నిర్ణయం పై టీడీపీ నేతలు ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ అంశం పై తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఈ అంశం కేంద్రం పరిధిలోకి రాదు అని తేల్చి చెప్పారు. అమరావతి లో సింగపూర్, జపాన్, తరహా రాజధాని అంటూ చంద్రబాబు హడావిడి చేశారు తప్ప, చేసింది ఏమీ లేదు అని ఘాటు విమర్శలు చేశారు. శ్రీకాకుళం లో పోర్ట్ ఎందుకు కట్టలేదో చర్చకు రావాలని చంద్రబాబు కి సవాల్ విసిరారు. ఆనాడు రాజధాని నిర్మాణం పై చంద్రబాబు కేంద్రాన్ని సంప్రదించలేదు అని, ప్రారంభోత్సవం అంటే మోడీ వచ్చారు అని,అపుడు బీజేపీ చంద్రబాబు ను ప్రశ్నించలేదు అని తెలిపారు.