ఏపీ బీజేపీ నేతకు షాక్.. పార్టీ నుంచి సస్పెండ్..!

Tuesday, October 20th, 2020, 05:44:55 PM IST

ఏపీ బీజేపీ నేత లంకా దినకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. గతంలో టీడీపీలో ఉన్న లంకా దినాకర్ కొద్ది రోజుల క్రితమే బీజేపీలో చేరారు. అయితే ఆయన పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, రాష్ట్ర శాఖ అనుమతి లేకుండా పలు టీవీ చర్చల్లో పాల్గొంటున్నారని, అంతేకాకుండా బీజేపీ అంతర్గత సమావేశాల్లోని వివరాలను వేరే పార్టీ వాళ్లకు చేరవేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి.

అయితే ఇప్పటికే ఈ విషయంపై ఆయనకు పార్టీ నోటీసులు జారీ చేసినా, ఆయనలో ఎలాంటి మార్పు లేకపోవడంతో అధిష్టానం తాజాగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొన్ని టీవీ ఛానెళ్లు తమ పార్టీకి చెందిన అధికార ప్రతినిధులను కాకుండా, తమ ఎజెండాకు అనుకూలంగా మాట్లాడే నాయకులను చర్చకు పిలుస్తున్నారని ఆరోపిస్తూ ఇకపైన తమ పార్టీలో అధికారిక ప్రతినిధులుగా ఉన్న నేతలనే చర్చకు పిలవాలని టీవీ ఛానెళ్లకు కూడా ఓ లేఖను పంపింది.