ఏపీ సీఎం జగన్ పాలనపై బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ దేవధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు విజయనగరంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో సింహాచలం నుంచి తిరుపతి దేవస్థానం వరకు దేవాదాయ భూములు వైసీపీ నేతల హస్తగతమవుతున్నాయని అన్నారు. అంతేకాదు రాస్ట్రంలో హిందూ మతం తీవ్ర సంక్షోభాన్ని ఎదురుకుంటుందని అన్నారు.
అయితే రాష్ట్రంలో ఓ మత వ్యాప్తికి, అభివృద్ధికే సీఎం జగన్ పాటుపడుతున్నారని ఆరోపించారు. అయితే పురందేశ్వరి విషయంలో ఇంతకు ముందే ట్విట్టర్ వేదికగా సునీల్ దేవధర్, వైసీపీ ఎంపీ విజయసాయి మధ్య మాటల తూటాలు పేలిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సునీల్ దేవధర్ చేసిన వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మరీ.