సీఎం జగన్‌కు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు లేఖ..!

Friday, September 4th, 2020, 01:38:03 PM IST

Somu_Veerraju

ఏపీ సీఎం జగన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ను ప్రభుత్వం నిషేధించడం బీజేపీ సాధించిన విజయమని అన్నారు. అయితే ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ వల్ల సామాన్య ప్రజల ఆలోచనా ధోరణిలో వచ్చే చెడు మార్పుల గురించి, ప్రజల సొమ్ము దోపిడీ అవడం గురించి మీ దృష్టికి 2020 మేలోనే తీసుకొచ్చానని, అలానే గుట్కాని ప్రభుత్వం నిషేధించినప్పటికీ, కిరాణా షాపుల్లో, కిళ్లీ షాపుల్లో దొరుకుతుందని అన్నారు.

అంతేకాదు బ్లాక్ మార్కెట్‌లో గుట్కా దొరకడం గురించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ రోజు ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేయడం బీజేపీ సాధించిన విజయం అని అలానే గుట్కా అమ్మకాలు కూడా అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలని జగన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.