ఇళ్ల స్థలాల పంపిణీని వెంటనే రద్దు చేయండి – బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

Wednesday, August 19th, 2020, 01:57:51 PM IST

ap-bjp-chief-somu-veerraju

ఏపీ ప్రభుత్వానికి బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సరికొత్త డిమాండ్ వినిపించారు. ఇటీవల పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆవ భూములలో ఇళ్ల స్థలాలు పంపిణీని వెంటనే రద్దు చేయాలని, రైతులకు ఇచ్చిన డబ్బుని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు.

అంతేకాదు ఆవలో ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి చర్యలు చేపట్టిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసిన ఇళ్ళ స్థలాలపై విజిలెన్స్ కమిటీ వేయాలని, ఇరిగేషన్ అధికారులు ఆవ భూములు నివాస యోగ్యం కాదని హెచ్చరించినా కేవలం విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లతో అనుమతులు తీసుకోవడం దారుణమని ఆయన విమర్శలు గుప్పించారు.